![]() |
![]() |

ఐస్ క్రీం మూవీ హీరోయిన్ తజస్విని మాదివాడ బిగ్ బాస్ బ్యూటీగా నాటీ గర్ల్ గా అందరికీ బాగా తెలుసు.. ఈమె కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే వంటి మూవీస్ లో నటించి తన అందాలతో అదరగొట్టింది. అలాగే "అర్దమయ్యిందా అరుణ్ కుమార్" అనే వెబ్ సిరీస్ లో నటించి కేక పుట్టించింది. సినిమాల కంటే బిగ్ బాస్ షో వల్ల చాలా పాపులర్ అయ్యింది తేజస్విని. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ రోల్ లో నటించింది...అలాగే కొన్ని తమిళ్ మూవీస్ లో కనిపించింది. బిగ్ బాస్ తర్వాత కొన్ని డాన్స్ షోస్ లో కూడా తేజు కనిపించింది. ఇక ఇప్పుడు ఆమె తన బాడీ మీద చాలా శ్రద్ద పెట్టింది. జిమ్ కి వెళ్లి బాడీని మంచి షేప్ లోకి తెచ్చుకుంది.
ఇక ఆ బాడీతో మంచి హాట్ ఫోటో షూట్స్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఫాన్స్ కి కిక్కెక్కిస్తోంది. ఇక ఇప్పుడు రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన పిక్ వైరల్ అవుతోంది. ఎవరైనా గుర్రం మీదెక్కి రైడ్ చేయడం చూసాం..కానీ తేజు మాత్రం వెరైటీగా కుక్క మీదెక్కి ఎంచక్కా గిరగిరా తిరిగేస్తోంది. ఇక తన గదిలో ఉన్న అన్ని కుక్కలతో చాలా ఫ్రెండ్లీగా తన ప్రేమను కురిపించింది తేజు...ఐతే తేజు ఎం చేసిన వెరైటీగా ఉంటుందని అంటున్నారు ఫాన్స్.. ఇక ఇండస్ట్రీలో తేజస్వినికి నవదీప్ చాలా మంచి ఫ్రెండ్. ఆర్జీవీ డైరెక్షన్లో 2014లో వచ్చిన "ఐస్ క్రీం" మూవీ అప్పట్లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ నుంచే నవదీప్, తేజస్వి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఐతే ఈ ఇద్దరికీ బుల్లితెర మీద సినిమా అవకాశాలు తగ్గేసరికి ఓటీటీపై ద్రుష్టి పెట్టి అక్కడ దూసుకుపోతున్నారు.
![]() |
![]() |